'సర్కారువారి పాట'లో హైలైట్ డైలాగ్స్ ఇవే!

  • ఈ రోజునే థియేటర్లకు దిగిపోయిన 'సర్కారువారి పాట'
  • భారీ ఓపెనింగ్స్ తో మొదలైన ప్రయాణం  
  • అక్కడక్కడా తన పెన్ను పవర్ చూపించిన పరశురామ్
  • విజిల్స్ తెచ్చుకుంటున్న డైలాగ్స్
మహేశ్ బాబు తాజా చిత్రంగా రూపొందిన 'సర్కారువారి పాట' సినిమా ఈ రోజునే భారీ స్థాయిలో విడుదలైంది. దర్శకుడు పరశురామ్ రాసిన కొన్ని డైలాగ్స్ బాగా పేలాయి. 'మీకు అప్పుడే పెళ్లేంటి సార్ .. చిన్నపిల్లాడైతేను' అని వెన్నెల కిశోర్ అంటే, ''అందరూ అలాగే అంటున్నారయ్యా .. మెయింటెయిన్ చేయలేక దూల తీరిపోతుంది ఇక్కడ". 'ఎక్కడ పడితే అక్కడున్నారయ్యా ఫ్యాన్స్ ..  కాస్త చూసుకోవాలి మరి" అనే డైలాగ్స్ మహేశ్ పర్సనల్ గా చెప్పినట్టుగా కనెక్ట్ అవుతాయి.

"ఆడపిల్ల అప్పులాంటిది .. ఎదుగుతుంటే భయం వేస్తుంది. నాకేమైనా అయితే నా కూతురు పరిస్థితేంటి అనే భయం .. అప్పు విషయంలో కూడా ఉండాలి" అని మహేశ్ అంటే, "నా దృష్టిలో అప్పు అనేది సెటప్పు లాంటిది .. అవసరానికి వాడుకుని వదిలేయడమే నాకు తెలుసు" అనే విలన్ డైలాగ్ రెండూ బాగా పేలాయి. 

 ఇక విలన్ పంపిన రౌడీలను బీచ్ లో చితక్కొట్టిన హీరో .. ఆ విలన్ తో ఫోన్లో " నువ్వు పంపించిన చేపలన్నిటినీ ఎండబెట్టాను. ఇవి అక్వేరియంలో ఆడుకోవడానికే పనికొస్తాయి. వీటిని సముద్రంలో వేటకి పంపించకు .. అక్కడ నాలాంటి తిమింగలాలు ఉంటాయి" అంటూ హెచ్చరిస్తాడు. ఈ సినిమాలో ఫస్టు మార్కు ఇచ్చే డైలాగ్ ఏదైనా ఉందంటే అది ఇదే.


More Telugu News