విజయ్ ను డిఫరెంట్ గా చూపించనున్న వంశీ పైడిపల్లి!

  • 66వ సినిమా పైకి రెడీ అవుతున్న విజయ్ 
  • సెట్  పైకి వెళ్లే పనుల్లో బిజీగా వంశీ పైడిపల్లి 
  • భారీ బడ్జెట్ ను కేటాయించిన దిల్ రాజు 
  • తమిళనాడు నేపథ్యంలో నడిచే కథ ఇది  
విజయ్ నుంచి ఇటీవల వచ్చిన 'బీస్ట్' అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. అయితే విజయ్ స్టైల్ పరంగా చూసుకుంటే మాత్రం బాగానే సందడి చేసిందనుకోవాలి. తమిళనాట రెస్పాన్స్ విజయ్ క్రేజ్ కి తగినట్టుగానే ఉన్నప్పటికీ మిగిలిన భాషల్లో అంతగా వసూళ్లను రాబట్టలేకపోయింది. 

ఈ నేపథ్యంలో తన నెక్స్ట్ ప్రాజెక్టు పైనే విజయ్ దృష్టి పెట్టాడు. కెరియర్ పరంగా విజయ్ కి ఇది 66వ సినిమా. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఈ సినిమాలో విజయ్ సరసన నాయికగా రష్మిక అలరించనుంది. 

ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో ఉంటుందనేది తాజా సమాచారం. లవ్ .. యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో బలంగా ఉంటాయని చెబుతున్నారు. తమిళనాడు నేపథ్యంలోనే ఈ కథ నడుస్తున్నట్టుగా చూపిస్తారట. విజయ్ హీరోయిజాన్ని వంశీ పైడిపల్లి డిజైన్ చేసిన తీరు కొత్తగా ఉంటుందని అంటున్నారు.


More Telugu News