22 నుంచి దావోస్ లో ఎకనమిక్ ఫోరం సదస్సు... జగన్ నేతృత్వంలో ఏపీ బృందం
- జగన్ వెంట మంత్రులు బుగ్గన, గుడివాడ, ఎంపీ మిథున్ రెడ్డి
- ఐదు రోజుల పాటు జరగనున్న సదస్సు
- బహుళ జాతి సంస్థలతో భేటీ కానున్న జగన్
- రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే దిశగా చర్చలు
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు ఈ నెల 22 నుంచి స్విట్జర్లాండులోని దావోస్ నగరంలో ప్రారంభం కానుంది. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు ఏపీ ప్రభుత్వం తరఫున హాజరు కానున్న ప్రతినిధి బృందానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా నేతృత్వం వహించనున్నారు.
జగన్ వెంట ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, పరిశ్రమల శాఖకు చెందిన ఉన్నతాధికారులు దావోస్ వెళ్లనున్నారు. సదస్సులో భాగంగా పలు బహుళ జాతి సంస్థలతో భేటీ కానున్న జగన్... రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విషయంపై చర్చించనున్నారు.