ఎయిరిండియా ఎండీ, సీఈవోగా క్యాంప్ బెల్ విల్సన్ నియామకం

  • ఇటీవల ఎయిరిండియాను కొనుగోలు చేసిన టాటా
  • తాజాగా కీలక నియామకం
  • విమానయాన రంగంలో క్యాంప్ బెల్ విల్సన్ కు సుదీర్ఘ అనుభవం
సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా మళ్లీ పాతగూటికే చేరిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ రంగ సంస్థగా నష్టాలు ఎదుర్కొన్న ఎయిరిండియాను ఇటీవలే టాటా సన్స్ కొనుగోలు చేసింది. ఎయిరిండియాను మళ్లీ లాభాల బాటలో నడిపించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న టాటా సన్స్ తాజాగా కీలక నియామకం చేపట్టింది. ఎయిరిండియా ఎండీ, సీఈవోగా క్యాంప్ బెల్ విల్సన్ ను నియమించింది. ఈ నియామకానికి ఎయిరిండియా బోర్డు ఆమోదం తెలిపింది. 

50 ఏళ్ల క్యాంప్ బెల్ విల్సన్ కు విమానయాన రంగంలో 26 ఏళ్ల అనుభవం ఉంది.  విల్సన్ ఇప్పటివరకు సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన చౌక ధరల విమానయాన సంస్థ స్కూట్ కు సీఈవోగా వ్యవహరించారు. టాటాల అధీనంలోని ఎయిరిండియా సంస్థకు తనను ఎండీ, సీఈవోగా నియమించడం పట్ల క్యాంప్ బెల్ విల్సన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ నియామకం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని తెలిపారు.


More Telugu News