ఇంట‌ర్నేష‌న‌ల్ సీడ్ టెస్టింగ్ అసోసియేష‌న్‌ అధ్యక్షుడిగా తెలంగాణ అధికారి కేశ‌వులు

  • తెలంగాణ విత్త‌నాభివృద్ధి సంస్థ ఎండీగా కేశ‌వులు
  • ఐఎస్‌టీసీ అధ్య‌క్షుడిగా ప‌ద‌వీ బాధ్య‌త‌ల స్వీకారం
  • ఆ ప‌ద‌విని చేప‌ట్టిన తొలి ఆసియా వ్య‌క్తిగా గుర్తింపు
  • కేశ‌వులును అభినందిస్తూ కేటీఆర్ ట్వీట్‌
తెలంగాణ రాష్ట్ర విత్త‌నాభివృద్ధి సంస్థ ఎండీగా కొన‌సాగుతున్న‌ తెలంగాణ అధికారి కె.కేశ‌వులు ఇప్పుడు ఇంట‌ర్నేష‌న‌ల్ సీడ్ టెస్టింగ్ అసోసియేష‌న్ (ఐఎస్‌టీఏ) అధ్య‌క్షుడిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అంత‌ర్జాతీయ సంస్థ‌గా కొన‌సాగుతున్న ఐఎస్‌టీఏకు ఇప్ప‌టిదాకా బార‌త్ కాదు క‌దా...ఆసియాకు చెందిన వ్య‌క్తి సార‌ధ్యం వ‌హించ‌లేదు. తాజాగా ఆ సంస్థ అధ్య‌క్షుడిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన తొలి తెలంగాణ అధికారిగానే కాకుండా తొలి భార‌త అధికారిగా, తొలి ఆసియా అధికారిగా కేశవులు రికార్డుల‌కెక్కారు. 

ఈ మేర‌కు కేశ‌వులుకు అభినంద‌న‌లు చెబుతూ తెలంగాణ మంత్రి కేటీఆర్ గురువారం ఓ ట్వీట్ చేశారు. సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ‌కు గుర్తింపు ఉన్న విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేసిన కేటీఆర్‌.. అలాంటి తెలంగాణ‌కు చెందిన అధికారికే ఐఎస్‌టీసీ సార‌థ్య బాధ్య‌త‌లు ద‌క్క‌డం స‌బ‌బేన‌న్న కోణంలో కేటీఆర్ ఆ ట్వీట్ చేశారు.


More Telugu News