మరింత బలహీనపడి అల్పపీడనంగా మారిన వాయుగుండం

  • బంగాళాఖాతంలో బలహీనపడిన అసని
  • మచిలీపట్నం వద్ద కేంద్రీకృతం
  • రాగల 12 గంటల్లో మరింత బలహీనపడే అవకాశం 
ఏపీ తీరప్రాంతంపై విస్తృత ప్రభావం చూపిన అసని తుపాను క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడది మరింత బలహీనపడి అల్పపీడనంగా మారిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. రాగల 12 గంటల్లో ఇది మరింత క్షీణించి అల్పపీడన ప్రాంతంగా మారుతుందని వివరించింది. 

ప్రస్తుతం ఇది మచిలీపట్నం తీరానికి సమీపంలోనే ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది.


More Telugu News