సామాజిక, రాజకీయ విశ్లేషకుడు నరసింహారావు మరణంపై దేవినేని ఉమ, అచ్చెన్నాయుడి స్పందన!
- ఈ ఉదయం కన్నుమూసిన సీనియర్ పాత్రికేయుడు నరసింహారావు
- తన పుస్తకాలతో యువతలో స్ఫూర్తిని నింపారన్న ఉమ
- ప్రజల పక్షాన మాట్లాడే గొంతుక అన్న అచ్చెన్నాయుడు
ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు, సీనియర్ పాత్రికేయుడు, రచయిత సి.నరసింహారావు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. నరసింహారావు మరణం బాధాకరమని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు. తన పుస్తకాలతో ఆయన యువతలో స్ఫూర్తిని నింపారని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.
టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, నరసింహారావు ప్రజల పక్షాన మాట్లాడే ప్రజాగొంతుక అని కొనియాడారు. సమకాలీన రాజకీయ విశ్లేషణలో ఆయన తనదైన ముద్ర వేశారని చెప్పారు. ప్రజా వ్యతిరేక విధానాలను నిర్ద్వంద్వంగా ఖండించిన వ్యక్తి అని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబసభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.