సంజయ్, ఇక ఆపు.. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటా: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి కేటీఆర్ వార్నింగ్

  • నిరాధార ఆరోపణలను వెంటనే ఆపమంటూ హెచ్చరిక 
  • ఆరోపణలకు ఆధారాలు చూపించమన్న కేటీఆర్  
  • లేదా బహరంగ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు మంత్రి కేటీఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. అనవసరంగా నిరాధార ఆరోపణలు చేయడం ఆపేయాలంటూ హెచ్చరించారు. ‘‘సంజయ్ ఇకనైనా ఈ నిరాధార, పిచ్చి, బాధ్యతారహితమైన ఆరోపణలను ఆపకుంటే.. చట్టపరమైన చర్యలను తీసుకుంటాను. మీ ఆరోపణలకు ఆధారాలేమైనా ఉంటే వాటిని బయటపెట్టాలి. ప్రజలకు తెలియజేయండి లేదా బహిరంగ క్షమాపణలు చెప్పాలి’’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు. 

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నిన్న షాద్ నగర్ లో మాట్లాడిన సంజయ్.. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు కేటీఆర్ కారణమన్నారు. కేటీఆర్ నిర్వాకం వల్ల 27 మంది ఇంటర్ పిల్లలు చనిపోయినా కేసీఆర్ స్పందించలేదని మండిపడ్డారు. తమ ఊరిలో బాగా చదివే ఓ అమ్మాయి ఉండేదని, ఆ అమ్మాయికి అన్నింట్లో వంద మార్కులొచ్చాయని, కానీ, ఒక్క సబ్జెక్టులో కేసీఆర్ ఫెయిల్ చేశారని ఆరోపించారు. అలా వందల మంది విద్యార్థులను ఫెయిల్ చేశారని అన్నారు. సంజయ్ వ్యాఖ్యలను రీట్వీట్ చేసిన కేటీఆర్.. క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు.


More Telugu News