'నలుగురిని అరెస్టు చేశాం'.. ప్రొద్దుటూరు బాలికపై సామూహిక అత్యాచారం కేసుపై ఎస్పీ అన్బురాజన్
- నిన్ననే పోలీసులు కేసు నమోదు చేశారన్న ఎస్పీ
- కేసులో జాప్యం చేస్తున్నారని అనడం సరికాదని వ్యాఖ్య
- ఆరు నెలల క్రితం ఆ బాలికపై ఇద్దరు వ్యక్తులు రేప్ చేశారని వెల్లడి
- నాలుగు నెలల క్రితం మరో ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారని వివరణ
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఎస్సీ బాలికపై కొందరు అఘాయిత్యానికి పాల్పడడంతో ఆమె గర్భం దాల్చిందని, నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోలేదని విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై ఎస్పీ అన్బురాజన్ స్పందిస్తూ వివరాలు తెలిపారు. బాలికపై అత్యాచార ఘటనలో నిన్ననే పోలీసులు కేసు నమోదు చేశారని ఆయన వెల్లడించారు.
నలుగురు నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పోలీసులు కేసులో జాప్యం చేస్తున్నారని అనడం సరికాదని ఆయన చెప్పారు. ఆరు నెలల క్రితం ఆ బాలికపై ఇద్దరు వ్యక్తులు, నాలుగు నెలల క్రితం మరో ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారని వివరించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామని చెప్పారు. అత్యాచార కేసులో అదనపు ఎస్సీ పూజిత ప్రస్తుతం ప్రొద్దుటూరు వెళ్లి విచారణ జరుపుతున్నారని అన్నారు.