బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన అల్లు అరవింద్

  • బాలీవుడ్ పరిస్థితి దారుణంగా ఉందన్న అల్లు అరవింద్
  • స్టార్లు నటించిన సినిమాలకు ఓపెనింగ్స్ కూడా రావడం లేదని వ్యాఖ్య
  • ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం తగ్గిందన్న అరవింద్
బాలీవుడ్ పై ప్రముఖ తెలుగు సినీ నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. అక్కడి స్టార్లు నటించిన చిత్రాలు కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోతున్నాయని... ఈ పరిస్థితి మారాలని చెప్పారు. దీనికంతటికీ కారణం ఇండియన్ ఇండస్ట్రీ చాలా మారడమేనని తెలిపారు. గతంలో కుటుంబం మొత్తం థియేటర్ కు వచ్చి సినిమా చూసేవాళ్లని... ఇప్పుడు ఓటీటీలో సినిమా ఎప్పుడు విడుదలవుతుందా? అని ఎదురు చూసే కాలం వచ్చిందని అన్నారు. కేవలం కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయని చెప్పారు. 

ఈ డేంజరస్ ట్రెండ్ నుంచి మనం కూడా బయటపడాల్సిన అవసరం ఉందని అన్నారు. మన తెలుగు ఇండస్ట్రీని కాపాడుకోవాలంటే స్టార్ హీరోలందరూ తమ ఈగోలను పక్కన పెట్టి పని చేయాలని చెప్పారు. విష్వక్సేన్ నటించిన 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమా సక్కెస్ మీట్ కు అల్లు అరవింద్ గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమా తాను చూశానని... చాలా బాగుందని చెప్పారు.


More Telugu News