ఆయన ఉద్దేశ్యమేంటో..?: మహేశ్ బాబు వ్యాఖ్యలపై ఆర్జీవీ స్పందన
- ఆయన వ్యాఖ్యల్లోని మర్మం అర్థం కాలేదన్న వర్మ
- బాలీవుడ్ ఒక కంపెనీ కాదని వ్యాఖ్య
- ఇటీవల పలు సినిమాలు అక్కడ బాగానే వసూళ్లు చేశాయిగా అన్న వర్మ
బాలీవుడ్ పై నటుడు మహేశ్ బాబు చేసిన వ్యాఖ్యల పట్ల ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఇటీవలే ఓ కార్యక్రమంలో భాగంగా మహేశ్ బాబు.. బాలీవుడ్ లో నటించడంపై ప్రశ్న ఎదుర్కొన్నారు. తనకు హిందీ పరిశ్రమ నుంచి ఎక్కువ అవకాశాలు రాలేదని, తనను బాలీవుడ్ భరించలేదని (రెమ్యునరేషన్ అయి ఉండొచ్చు) ఆయన బదులిచ్చారు.
ఈ వ్యాఖ్యల పట్ల బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసిన రామ్ గోపాల్ వర్మ స్పందించారు. మహేశ్ బాబు వ్యాఖ్యల్లోని మర్మమేంటో తనకు అర్థం కాలేదన్నారు. ‘‘ఒక నటుడిగా అది అతడి ఎంపిక. బాలీవుడ్ భరించలేదన్న ఆయన వ్యాఖ్యల్లోని అర్థం ఏంటో నిజాయతీగా నాకు అర్థం కాలేదు. ఇటీవల దక్షిణాది సినిమాలను గమనించినట్టయితే.. అవి హిందీలోకి డబ్బింగ్ అయి విడుదలయ్యాయి. వారు ఖర్చు చేసిందంతా వెనక్కి వచ్చేసింది.
బాలీవుడ్ ఒక కంపెనీ కాదు. మీడియా ఇచ్చిన లేబుల్ మాత్రమే. విడిగా ఒక మూవీ కంపెనీ లేదా నిర్మాణ సంస్థ ఇంత బడ్జెట్ తో నటించాలని కోరొచ్చు. కనుక బాలీవుడ్ ను సాధారణీకరించి ఎలా చెప్తారు?’’ అని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు.