నారాయ‌ణ బెయిల్ ర‌ద్దు కోరుతూ హైకోర్టును ఆశ్ర‌యించే దిశ‌గా ఏపీ ప్ర‌భుత్వం

  • టెన్త్ క్వ‌శ్చ‌న్ పేప‌ర్ల లీక్‌లో నారాయ‌ణ అరెస్ట్‌
  • వ్య‌క్తిగ‌త పూచీక‌త్తుపై బెయిల్ ఇచ్చిన చిత్తూరు కోర్టు
  • నారాయ‌ణ బెయిల్‌ను స‌వాల్ చేసే దిశ‌గా ఏపీ ప్ర‌భుత్వం
  • రేపు హైకోర్టులో లంచ్ మోష‌న్ పిటిష‌న్ వేసే అవ‌కాశం
పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్టయిన టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి నారాయ‌ణ‌కు కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను ర‌ద్దు చేయించే దిశ‌గా ఏపీ ప్ర‌భుత్వం సాగుతున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ దిశ‌గా ఏపీ ప్రభుత్వ వ‌ర్గాలు న్యాయ నిపుణుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు సమాచారం.

ప్ర‌శ్నప‌త్రాల లీకేజీ కేసులో అరెస్టయిన నారాయ‌ణ‌కు చిత్తూరు కోర్టు వ్య‌క్తిగ‌త పూచీక‌త్తు మీద‌ బెయిల్ మంజూరు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో నారాయ‌ణ బెయిల్‌ను స‌వాల్ చేస్తూ ప్ర‌భుత్వం హైకోర్టులో గురువారం నాడు లంచ్ మోష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేసే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది.


More Telugu News