వైఎస్ కొండారెడ్డిపై జిల్లా బహిష్కరణ వేటు... కడప కలెక్టర్‌కు ఎస్పీ సిఫారసు
- కాంట్రాక్టర్లను బెదిరించిన కేసులో కొండారెడ్డి అరెస్ట్
- బెయిల్‌పై విడుదలైన కొండారెడ్డి
- ఆయనపై బహిష్కరణ వేటుకు రంగం సిద్ధం
కాంట్రాక్టర్లపై బెదిరింపులకు దిగిన పులివెందుల నియోజకవర్గం చక్రాయిపేట మండల వైసీపీ ఇంచార్జీ వైఎస్ కొండారెడ్డిపై జిల్లా బహిష్కరణ వేటుకు రంగం సిద్ధం అయ్యింది. వైఎస్ కొండారెడ్డిని జిల్లా నుంచి బహిష్కరించాలని నిర్ణయించిన కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపాలంటూ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో పనులు చేస్తున్న ఎస్సార్కే కన్‌స్ట్రక్షన్స్ ప్రతినిధుల నుంచి లంచం కోసం బెదిరించిన కేసులో రెండు రోజుల క్రితం కొండారెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో లక్కిరెడ్డిపల్లి కోర్టు బెయిల్ ఇవ్వడంతో బుధవారం ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఈ క్రమంలో కొండారెడ్డిపై జిల్లా బహిష్కరణ వేటుకు రంగం సిద్ధం కావడం గమనార్హం.