ఇండస్ట్రీకి వస్తానంటే పూరి కోప్పడ్డాడు: దర్శకుడు పరశురామ్
- 'సర్కారువారి పాట' ప్రమోషన్స్ లో బిజీగా పరశురామ్
- పూరితో తనకి గల సాన్నిహిత్యం గురించి ప్రస్తావన
- ఇద్దరిదీ ఒకే ఊరు కావడమే అందుకు కారణమంటూ వివరణ
- ఆయన దగ్గరే డైరెక్షన్ నేర్చుకున్నానని చెప్పిన పరశురామ్
మహేశ్ బాబు హీరోగా పరశురామ్ రూపొందించిన 'సర్కారువారి పాట' సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో పరశురామ్ మాట్లాడుతూ .. "పూరిని నేను అన్నయ్య అని పిలుస్తూ ఉంటాను. మా ఇద్దరిదీ ఒకే ఊరు కావడం వలన ఆయనతో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే ఒకసారి మా ఊరు నుంచి హైదరాబాద్ వచ్చేశాను. సినిమా ఫీల్డ్ లోకి వద్దామని అనుకుంటున్నట్టుగా చెప్పాను.
దాంతో 'ఇండస్ట్రీ అంటే ఏమనుకుంటున్నావ్ .. ముందు బాగా చదువుకో ..' అని చెప్పి ఆయన నాపై కోప్పడ్డాడు. దాంతో నేను మళ్లీ మా ఊరికి వెళ్లిపోయాను. అలా కొంతకాలం తరువాత మహేశ్ బాబు సినిమా 'ఒక్కడు' రిలీజ్ అయింది.
దాంతో ఇక లాభం లేదు .. ఇండస్ట్రీకి వెళ్లిపోవలసిందే అనే పట్టుదలతో హైదరాబాద్ వచ్చేసి, అన్నయ్య దగ్గర డైరెక్షన్ డిపార్టుమెంటులో చేరిపోయాను. ఆ తరువాత ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఇక్కడి వరకూ వచ్చాను. మహేశ్ బాబుగారితో చెప్పుకోదగిన మూవీ చేయాలనుకున్నాను .. చేశాను. ఇక ఆడియన్స్ రెస్పాన్స్ కోసమే వెయిట్ చేస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.