సీపీఎస్ బ‌దులుగా జీపీఎస్‌.. మ‌రోమారు ఉద్యోగ సంఘాల‌కు ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిపాద‌న‌

  • గ‌తంలోనే వ్య‌తిరేకించిన ఉద్యోగ సంఘాలు
  • తాజా స‌మావేశంలోనూ జీపీఎస్‌పైనే కీల‌క చ‌ర్చ‌
  • ఉద్యోగ సంఘాల ప్ర‌తినిధుల అభిప్రాయాల‌ సేకరణ  
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం బుధ‌వారం మ‌రోమారు ఉద్యోగ సంఘాల‌తో భేటీ అయ్యింది. అమ‌రావ‌తిలోని స‌చివాల‌యంలో బుధ‌వారం సాయంత్రం ప్రారంభ‌మైన ఈ స‌మావేశానికి ప్ర‌భుత్వం త‌ర‌పు నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖ కీల‌క అధికారులు హాజ‌రు కాగా... ఉద్యోగ సంఘాల నుంచి ఆయా సంఘాల ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు. సీపీఎస్ ర‌ద్దుకు సంబంధించి ఈ స‌మావేశంలో చ‌ర్చిస్తున్నారు.

కంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ స్కీమ్ (సీపీఎస్‌) బ‌దులుగా గ్యారెంటీ పెన్ష‌న్ స్కీం (జీపీఎస్‌)ను అమ‌లు చేస్తామ‌ని ఇదివ‌ర‌కే ప్ర‌భుత్వం ఉద్యోగ సంఘాల‌కు సూచించిన విష‌యం తెలిసిందే. అయితే నాడు ఉద్యోగ సంఘాల నుంచి ఈ ప్ర‌తిపాద‌న‌పై వ్య‌తిరేకత రాగా.. తాజాగా జ‌రుగుతున్న సమావేశంలోనూ ఇదే అంశాన్ని ప్ర‌తిపాదించిన ప్ర‌భుత్వం... అస‌లు జీపీఎస్‌ అమ‌లుపై ఉద్యోగ సంఘాల ప్ర‌తినిధుల అభిప్రాయాల‌ను సేక‌రిస్తోంది.


More Telugu News