బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ సెటైర్
- రూపాయికి భరోసా లేదన్న సుమన్
- అధిక ధరలకు అంతం లేదని వ్యాఖ్య
- చీకట్లో దేశం, వెలుగుల్లో ఆదానీ, అంబానీలంటూ విమర్శ
- ప్రభుత్వ సంస్థలకూ గ్యారెంటీ లేదన్న సుమన్
కేంద్రంలోని బీజేపీ సర్కారుపై టీఆర్ఎస్ యువనేత, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో చోటుచేసుకుంటున్న పలు కీలక పరిణామాలను సోదాహరణంగా ప్రస్తావిస్తూ బాల్క సుమన్ ఈ సెటైర్లు సంధించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సుమన్ బుధవారం ఓ ట్వీట్ పోస్ట్ చేశారు.
రూపాయికి భరోసా లేదన్న బాల్క సుమన్.. అధిక ధరలకు అంతం లేదంటూ ఆరోపించారు. జీడీపీ నేల చూపులు చూస్తోంటే... ఆర్థిక వ్యవస్థ ఆగమై పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. దేశం చీకట్లో మగ్గిపోతోంటే... అదానీ, అంబానీలు వెలిగిపోతున్నారని ఆయన వ్యంగ్యం ప్రదర్శించారు. యువతకు ఉద్యోగాల్లేవని... ప్రభుత్వ సంస్థలకు గ్యారంటీ లేదని ఆయన విసుర్లు సంధించారు. కమాల్ మోడీ .. ఢమాల్ ఇండియా పేరిట దేశంలో బీజేపీ కొత్త నినాదం ఎత్తుకుందని ఆయన దెప్పి పొడిచారు.