అసని తుపాన్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: పవన్ కల్యాణ్
- అసని తుపాను బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలన్న పవన్
- రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం భరోసా ఇవ్వాలని డిమాండ్
- పండ్ల తోటలు, ఉద్యాన పంటలు వేసిన రైతులు దెబ్బతిన్నారని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ లో అసని తుపాన్ తీవ్ర అలజడి సృష్టిస్తోన్న నేపథ్యంలో బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సర్కారుకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం భరోసా ఇవ్వాలని ఓ ప్రకటన విడుదల చేశారు. తుపాను ప్రభావం కోస్తా జిల్లాలు.. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల మీద తీవ్ర స్థాయిలో కనపడుతోందని ఆయన చెప్పారు.
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తుపాను ప్రభావం వల్ల.. పండ్ల తోటలు, ఉద్యాన పంటలు వేసిన రైతులు కూడా దెబ్బతిన్నారని ఆయన చెప్పారు. తీరంలోని మత్స్యకార గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. ఇళ్లు దెబ్బ తిన్న వారిని ఆదుకోవాలని, వారికి జనసేన శ్రేణులు కూడా బాసటగా నిలవాలని ఆయన పేర్కొన్నారు.