స్కిన్ అలెర్జీలు అసలు ఎందుకు వస్తాయో తెలుసా..?
- ప్రకృతిలోని ప్రతి కారకాల వల్లే
- శరీరంలోకి వచ్చిన కొత్త వస్తువును వ్యాధినిరోధకత గుర్తిస్తుంది
- యాంటీబాడీల విడుదలతో ఫైటింగ్
- మిత్రులపైనా దాడి చేయవచ్చు
- ఆ సమయంలో వచ్చేవే అలెర్జీలు
చర్మంపై కొన్ని రకాల అలెర్జీలు సాధారణంగా కనిపిస్తుంటాయి. అవి ఎందుకు వస్తాయన్నది తెలియదు. చాలా వరకు అవి కొన్ని రోజుల్లో తగ్గిపోతుంటాయి. కొన్ని మాత్రం మందులతోనే లొంగుతాయి. ఔషధాలు సరిపడకపోవడం, ఆహారం కారణంగా వచ్చే అలెర్జీలు చర్మంపై ఎక్కువ సందర్భాల్లో కనిపించవు. అదే కీటకాలు కుట్టడం వంటి వాటిల్లో చర్మంపై వెంటనే ఆ ఫలితం కనిపిస్తుంది.
ప్రకృతిలోని ఎన్నో అలెర్జీ కారకాలకు (అలెర్జెన్స్) ముందుగా ప్రభావితమయ్యే వాటిల్లో చర్మమే ఉంటుంది. ఈ సమయంలో మన వ్యాధి నిరోధక శక్తి స్పందించే తీరుపైనే మనకు అలెర్జీలు రావడం ఆధారపడి ఉంటుంది.
చర్మ అలెర్జీలు.. కారణాలు..
‘‘వేరు శనగలు, పాలు, గుడ్లు, సోయా, గోధుమ, పుప్పొడులు, పాయిజన్ ఐవీ (ఒక చెట్టు ఆకు), నికెల్, లేటెక్స్, వస్త్రాలు, ప్రిజర్వేటివ్ లు, మెడికేషన్, ఫ్రాగ్రాన్స్, మేకప్ వస్తువులు అన్నీ కూడా సాధారణ అలెర్జీ కారకాలు. అలెర్జిక్ కాంటాక్ట్ డెర్మటైటిస్, చర్మ అలెర్జీలు అన్నవి అలెర్జీ కారకాలకు వ్యాధి నిరోధక శక్తి స్పందిచడం ఆలస్యం అవ్వడం వల్ల వచ్చేవే’’ అని డాక్టర్ మానసి శిరోలికార్ వివరించారు.
‘‘అలెర్జీలు ఎలా తలెత్తుతాయి? అనే విషయంలో వ్యాధి నిరోధక శక్తి కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా ఏదైనా ఫారిన్ వస్తువు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు వ్యాధి నిరోధక శక్తి స్పందించి కాపాడుతుంది. స్నేహితుడు, శత్రువుకు మధ్య తేడాను శరీరం గుర్తించేందుకు సాయపడుతుంది. శత్రువును తుదముట్టిస్తుంది. ఎప్పుడైతే శరీరం ఫారిన్ వస్తువుకు లోను అయిందో అప్పుడు శరీరం యాంటీబాడీలను విడుదల చేస్తుంది. ఇవి వెళ్లి యాంటిజెన్స్ (ఫారిన్ వస్తువు) కు అతుక్కుంటాయి. దాంతో వ్యాధి నిరోధకశక్తి ఈ యాంటీజెన్ ను అంతం చేసేందుకు దారి చూపుతాయి.
ఈ ప్రక్రియలో లింఫోసైట్స్ చిన్నపాటి ప్రొటీన్ పార్టికల్స్ ను కూడా విడుదల చేస్తాయి. వాటిని ఇమ్యూనిటీ మీడియేటర్లు అంటారు. ‘శత్రువు చొరబడింది. పోరాడాలి’ అంటూ శరీరానికి ఇవి సూచిస్తాయి. శరీరాన్ని సన్నద్ధం చేస్తాయి. దాంతో ఫారిన్ బాడీల నుంచి రక్షణ లభిస్తుంది. కానీ, ఈ క్రమంలో యాంటీబాడీలు పొరపాటున స్నేహితుడిని కూడా శుత్రువుగా భావించినప్పుడు సమస్య ఏర్పడుతుంది. ఆ సమయంలో ఏర్పడేదే స్కిన్ అలెర్జీ (డెర్మటైటిస్)’’ అని డాక్టర్ సేజల్ సహేత వివరించారు.
లక్షణాలు
ర్యాషెస్, చర్మం ఎర్రబడటం, దద్దురులు ఏర్పడి.. దురదగా అనిపిస్తుంది. సాధారణంగా ఇవి వాటంతట అవే తగ్గిపోతాయి. కొన్ని సందర్భాల్లో శరీరంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తాయి. ఆ సమయంలో యాంటీ అలెర్జిక్ మందులు వాడాల్సి ఉంటుంది. కొన్ని అరుదైన సందర్భాల్లో గొంతు లేదా నోటి చుట్టూ వాపు ఏర్పడొచ్చు. ఈ పరిస్థితుల్లో వైద్యులను సంప్రదించాలి.