మహేశ్ 'మురారి బావ' సాంగ్ యూట్యూబ్ లోనే!
- 'సర్కారువారి పాట'లో నాలుగు సాంగ్స్
- ప్రతి పాటకి లభిస్తున్న రికార్డు స్థాయి వ్యూస్
- మరో పాటను నేరుగా యూ ట్యూబ్ లో వదిలే ఆలోచన
- ఈ నెల 12వ తేదీన సినిమా విడుదల
మహేశ్ బాబు తాజా చిత్రంగా రూపొందిన 'సర్కారువారి పాట' రేపు భారీ స్థాయిలో విడుదలవుతోంది. కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ నాలుగు సాంగ్స్ వదిలారు. అయితే 'మురారి బావ' అనే మరో సాంగ్ ఉందనీ, అది థియేటర్లో చూడవలసిందే అనే టాక్ వినిపిస్తోంది.
పరశురామ్ మాత్రం తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ సినిమాలో నాలుగు సాంగ్స్ మాత్రమే ఉంటాయని స్పష్టం చేశాడు. అయితే ఈ సినిమా కోసం 'మురారి బావ' అనే సాంగును మహేశ్ - కీర్తి సురేశ్ పై చిత్రీకరించారట. అయితే ఆ ప్లేస్ లో కాస్త మాస్ బీట్ ఉంటే బాగుంటుందని టీమ్ అభిప్రాయపడిందట.
చివరికి 'మురారి బావ' అనే సాంగ్ ను పక్కన పెట్టేసి, 'మ మ మహేశా' అనే సాంగ్ ను చిత్రీకరించినట్టు సమాచారం. ఇప్పుడు ఈ సాంగ్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఇక ఈ సినిమాను రిలీజ్ చేసిన తరువాత, 'మురారి బావ' పాటను యూ ట్యూబ్ లో వదలనున్నట్టుగా చెబుతున్నారు. మొత్తానికి మహేశ్ సినిమా నుంచి ఫ్యాన్స్ కి మరో గిఫ్ట్ రెడీగా ఉందన్న మాట.