చైనా అధ్య‌క్షుడు జిన్ పింగ్ కు తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లు

  • సెరిబ్ర‌ల్ ఎన‌రిజంతో బాధపడుతున్న జిన్ పింగ్
  • మెద‌డులోని ధ‌మ‌నుల్లో వాపు 
  • చైనీయుల సంప్ర‌దాయ వైద్య చికిత్స తీసుకుంటోన్న నేత‌
చైనా అధ్య‌క్షుడు జిన్ పింగ్ తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ చికిత్స తీసుకుంటున్నారు. ఆయ‌న‌కు మెద‌డు సంబంధిత వ్యాధి (సెరిబ్ర‌ల్ ఎన‌రిజం) సోక‌డంతో ప్ర‌స్తుతం ఆయ‌న చైనీయుల సంప్ర‌దాయ వైద్య చికిత్స తీసుకుంటున్నారు. స‌ర్జ‌రీకి బ‌దులుగా ఆయ‌న ఈ చికిత్స తీసుకుంటున్నారు. ఈ చికిత్స ద్వారా మెద‌డులోని ర‌క్త నాళాలు మెత్త‌బ‌డి వ్యాధి త‌గ్గే అవ‌కాశాలు ఉంటాయి. 

మెద‌డులోని ధ‌మ‌నుల్లో వాపు రావ‌డం వ‌ల్లే ఆయ‌న చాలా కాలం నుంచి విదేశీ నేత‌ల‌ను క‌ల‌వ‌డం లేదు. క‌రోనా విజృంభ‌ణ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి బీజింగ్ వింట‌ర్ ఒలింపిక్స్ వ‌ర‌కు ఆయ‌న అన్ని స‌మావేశాల‌కు దూరంగానే ఉంటున్నారు. 2019లో జిన్ పింగ్‌ ఇట‌లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన స‌మ‌యంలోనూ ఆయ‌న ఇబ్బందులు ప‌డ్డారు. 

అలాగే, ఆయ‌న‌ ఫ్రాన్స్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన స‌మ‌యంలో న‌డిచేందుకు ఇబ్బందిప‌డ్డారు. కుర్చీపై కూర్చోవ‌డానికి కూడా ఆయ‌న ఇత‌రుల సాయం తీసుకున్నారు. 2020 అక్టోబ‌ర్‌లో షెంజెన్‌లో ప్రసంగిస్తున్న స‌మ‌యంలో ఆయ‌నకు విప‌రీతంగా ద‌గ్గు వ‌చ్చింది. గ‌త ఏడాది చివ‌ర‌లో ఆయ‌న ఆసుప‌త్రిలో చేరి చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయిన‌ట్లు స‌మాచారం.


More Telugu News