వివేకానందరెడ్డి హత్యకేసు: కడపను విడిచిపెట్టి వెళ్లకుంటే అంతు చూస్తామని సీబీఐ అధికారుల కారు డ్రైవర్‌కు బెదిరింపులు
- అధికారులకు భోజనం పట్టుకుని వస్తుండగా అడ్డగింత
- అధికారులతోపాటు డ్రైవర్ కూడా కడపను వదిలిపెట్టాలని వార్నింగ్
- చిన్న చౌక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ సిబ్బంది కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న వలీబాషాను గుర్తు తెలియని వ్యక్తులు కొందరు బెదిరించారు. వెంటనే కడపను వదిలిపెట్టి వెళ్లాలని, లేదంటే అంతు చూస్తామని హెచ్చరించారు. దీంతో ఆయన కడప చిన్నచౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 8న సీబీఐ అధికారులకు భోజనం తెచ్చేందుకు వలీబాషా కారులో కడపలోని హరిత హోటల్ నుంచి బైపాస్ రోడ్డులోని దాబాకు వెళ్లారు. భోజనం పట్టుకుని తిరిగి వస్తుండగా ముఖానికి మాస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు కారుకు బైక్‌ను అడ్డంపెట్టారు. అనంతరం సీబీఐ అధికారులతోపాటు నువ్వు కూడా కడపను వదిలిపెట్టి వెళ్లాలని, లేదంటే అంతుచూస్తామని హెచ్చరించి వెళ్లిపోయారు. దుండగులు తనను బెదిరించిన విషయమై ఈ నెల 9న వలీబాషా పోలీసులకు ఫిర్యాదు చేశారు.