కిషన్ రెడ్డితో వైసీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు భేటీ... కోటప్పకొండను 'ప్రసాద్' పథకంలో చేర్చాలని వినతి
- రాయల కాలం నుండి వెలుగొందుతున్న శైవ క్షేత్రం కోటప్పకొండ
- పర్యావరణ పర్యాటక కేంద్రంగా రూపొందిస్తున్నామని వెల్లడి
- రాష్ట్ర ప్రభుత్వానికి తోడ్పాటు అందించాలన్న ఎంపీ
వైసీపీ యువ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మంగళవారం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన నియోజకవర్గ పరిధిలోని కోటప్పకొండకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'ప్రసాద్' పథకాన్ని వర్తింపజేయాలని కోరారు. ఈ మేరకు కిషన్ రెడ్డికి ఎంపీ ఓ వినతి పత్రాన్ని సమర్పించారు.
కోటప్పకొండను ఆర్తుల అండగా అభివర్ణించిన వైసీపీ ఎంపీ... శ్రీకృష్ణదేవరాయలు కాలం నుండి దేదీప్యమానంగా వెలుగొందుతున్న శైవక్షేత్రంగా పేర్కొన్నారు. ఈ కారణంగా కోటప్పకొండను పర్యావరణ పర్యాటక ప్రదేశంగా మలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు తోడ్పాటు అందించాలని కోరారు. అందుకోసం ప్రసాద్ పథకాన్ని కోటప్పకొండకు వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.