మరోమారు సచివాలయానికి సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు
- టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఏబీవీ
- నిఘా పరికరాల్లో అక్రమాలంటూ ఏబీవీని సస్పెండ్ చేసిన జగన్ సర్కారు
- సస్పెన్షన్ ను ఎత్తేసి పోస్టింగ్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు తీర్పు
- పోస్టింగ్ కోసమే రెండో సారి సచివాలయానికి వచ్చిన ఏబీవీ
ఏపీ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు మంగళవారం అమరావతి పరిధిలోని ఏపీ సచివాలయానికి వచ్చారు.
టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్ డీజీగా వ్యవహరించిన వెంకటేశ్వరరావు... నిఘా పరికరాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ జగన్ సర్కారు ఆయనను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తన సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన వెంకటేశ్వరరావు తనకు అనుకూలంగా తీర్పు పొందారు.
ఈ నేపథ్యంలో తనకు పోస్టింగ్ ఇవ్వాలంటూ ఆయన ఇదివరకే ఓ పర్యాయం సీఎస్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ ఆయనకు పోస్టింగ్ ఆర్డర్లు రాకపోవడంతో మరోమారు మంగళవారం సీఎస్‌ను కలిసేందుకు సచివాలయానికి వచ్చారు.