దుప్పటితో కాళ్లను కప్పుకుని కనిపించిన పుతిన్... రష్యా అధినేత ఆరోగ్యంపై మరిన్ని సందేహాలు!
- పుతిన్ కు క్యాన్సర్ అంటూ ప్రచారం
- సర్జరీకి సిద్ధపడ్డాడని వార్తలు
- ఇటీవల రష్యా విక్టరీ డే ఉత్సవాలు
- చలి నుంచి రక్షణకు అదనపు దుస్తులతో కనిపించిన పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్యాన్సర్ తో బాధపడుతున్నారని, ఆయనకు శస్త్రచికిత్స తప్పనిసరి అని వైద్యులు చెప్పారని వార్తలు వస్తుండడం తెలిసిందే. అయితే, పుతిన్ తన అనారోగ్యంపై మరిన్ని సందేహాలు రేకెత్తించేలా... ఇటీవల విక్టరీ డే వేడుకల్లో మందంగా ఉన్న దుప్పటితో కాళ్లను కప్పుకుని దర్శనమిచ్చారు. అంతేకాదు, పుతిన్ దగ్గుతూ కనిపించాడని, అక్కడున్న వారందరిలో చలి నుంచి కాపాడుకోవడానికి అదనపు దుస్తులు ధరించింది పుతిన్ ఒక్కడేనని ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ పేర్కొంది.
పుతిన్ క్యాన్సర్ తో గానీ, పార్కిన్సన్స్ వ్యాధితో గానీ బాధపడుతుండొచ్చని గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. సర్జరీకి కూడా సిద్ధపడ్డాడని, అయితే శస్త్రచికిత్స వల్ల కొంతకాలం పాటు పుతిన్ శారీరకంగా బలహీనంగా మారతారని వైద్యులు హెచ్చరించినట్టు కూడా కథనాలు వచ్చాయి.
ఇటీవల ఓ సమావేశంలో టేబుల్ ను గట్టిగా పట్టుకుని కూర్చుని ఉన్న దృశ్యాలు కూడా సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. సమావేశం జరిగినంత సేపు పుతిన్ టేబుల్ ను పట్టుకునే ఉండడం వీడియోలో వెల్లడైంది.