నారాయ‌ణ అరెస్ట్‌పై స్పందించిన‌ చిత్తూరు పోలీసులు... ఈ సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు

  • హైద‌రాబాద్‌లో ఉద‌యం 10.30 గంట‌ల‌కు నారాయ‌ణ అరెస్ట్‌
  • ప‌బ్లిక్ ఎగ్జామ్స్ ప్రివెన్ష‌న్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ చ‌ట్టం కింద కేసు న‌మోదు
  • ఐపీసీ 408,409, 201,120(బీ) సెక్ష‌న్ల‌తో పాటు 65 ఐటీ చ‌ట్టం కింద కేసు
  • పబ్లిక్ ఎగ్జామ్స్ చ‌ట్టంలోని సెక్ష‌న్ 5,8,10 కింద నారాయ‌ణ‌పై కేసు
  • ఈ సాయంత్రానికి నారాయ‌ణ‌ను కోర్టులో హాజ‌రుప‌రుస్తామ‌న్న పోలీసులు
టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌ను అరెస్ట్ చేసిన వ్య‌వ‌హారంపై చిత్తూరు పోలీసులు స్పందించారు. నారాయ‌ణ‌ను అరెస్ట్ చేసిన మాట వాస్త‌వ‌మేన‌ని తెలిపిన పోలీసులు... హైద‌రాబాద్‌లో మంగ‌ళ‌వారం ఉద‌యం 10.30 గంట‌ల‌కు ఆయ‌న‌ను అరెస్ట్ చేశామ‌ని తెలిపారు. అనంత‌రం ఆయ‌న‌ను చిత్తూరు త‌ర‌లిస్తున్నామ‌ని కూడా తెలిపారు. 

ఈ సంద‌ర్భంగా నారాయ‌ణ‌పై న‌మోదు చేసిన కేసుల వివ‌రాల‌ను కూడా చిత్తూరు పోలీసులు వెల్ల‌డించారు. ప‌బ్లిక్ ఎగ్జామ్స్ ప్రివెన్ష‌న్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ చ‌ట్టం కింద, ఐపీసీ సెక్ష‌న్లు 408,409, 201,120(బీ),తో పాటు 65 ఐటీ చ‌ట్టం కింద ఆయనపై కేసు న‌మోదు చేశారు. ఇక ప‌బ్లిక్ ఎగ్జామ్ చ‌ట్టంలోని సెక్ష‌న్లు 5, 8, 10 కింద కూడా నారాయ‌ణ‌పై కేసులు న‌మోదు చేశారు. ఇదిలా ఉంటే ఈ సాయంత్రానికి చిత్తూరు త‌ర‌లించ‌నున్న నారాయ‌ణ‌ను అక్కడి జ్యూడీషియ‌ల్ కోర్టులో హాజ‌రుప‌రుస్తామ‌ని చెప్పారు. 


More Telugu News