నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 105 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 61 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 7 శాతం వరకు నష్టపోయిన టాటా స్టీల్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం నుంచి ఒడిదుడుకుల మధ్య కొనసాగిన మార్కెట్లు చివరకు నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. మధ్యాహ్నం లాభాల్లోకి వెళ్లినప్పటికీ... ఆ తర్వాత మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 105 పాయింట్లు నష్టపోయి 54,364కి పడిపోయింది. నిఫ్టీ 61 పాయింట్లు కోల్పోయి 16,240 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (3.24%), ఏసియన్ పెయింట్స్ (2.46%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.40%), అల్ట్రాటెక్ సిమెంట్ (2.22%), మారుతి (2.14%).
టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-6.95%), సన్ ఫార్మా (-2.74%), ఎన్టీపీసీ (-2.33%), టైటాన్ (-2.15%), బజాజ్ ఫైనాన్స్ (-1.80%).