ఒక్కరోజు పవర్ హాలిడేను ఎత్తివేస్తున్నాం: ఏపీ మంత్రి పెద్దిరెడ్డి
- రాష్ట్రంలో విద్యుత్ వినియోగం తగ్గిందన్న మంత్రి
- ప్రస్తుత వినియోగం 180 మిలియన్ యూనిట్లుగా ఉందని వెల్లడి
- పరిశ్రమలకు 70 శాతం విద్యుత్ వినియోగానికి అనుమతినిస్తున్నట్టు వివరణ
- ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజీలకు 100 శాతం అనుమతినిస్తున్నామన్న పెద్దిరెడ్డి
ఏపీలో విద్యుత్ కొరత నేపథ్యంలో పరిశ్రమలకు ప్రకటించిన పవర్ హాలిడేల విషయంలో మంగళవారం నాడు కాస్తంత ఊరట కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలకు ఒక్క రోజు పవర్ హాలిడేను ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా ఆయా కేటగిరీలకు చెందిన పరిశ్రమలకు విద్యుత్ వినియోగానికి సంబంధించిన పరిమితులను కూడా సడలిస్తున్నట్లు పెద్దిరెడ్డి చెప్పారు.
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం తగ్గిందన్న పెద్దిరెడ్డి.. రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ వినియోగం 180 మిలియన్ యూనిట్లుగా ఉందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగం తగ్గిన నేపథ్యంలో పరిశ్రమలకు మరింత మేర విద్యుత్‌ను అందించనున్నామని ఆయన తెలిపారు. అన్ని రకాల పరిశ్రమలకు 70 శాతం విద్యుత్ వినియోగానికి అనుమతినిస్తున్నామని, ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజీలకు 100 శాతం విద్యుత్ వినియోగానికి అనుమతి నిస్తున్నామని మంత్రి తెలిపారు.