రాష్ట్రానికి పట్టిన చీడపురుగులు చంద్రబాబు, లోకేశ్: మంత్రి రోజా
- వాళ్ల వల్ల ఏపీకి ఎలాంటి ఉపయోగం లేదన్న మంత్రి
- వచ్చే ఎన్నికల్లో వారిని తరిమికొడతారని హెచ్చరిక
- చిరంజీవిలాగా పవన్ కు విలువల్లేవా? అంటూ ప్రశ్న
- పవన్ ఏ పార్టీకి పనిచేస్తున్నారో ఆయన అభిమానులే కన్ఫ్యూజన్ లో ఉన్నారని కామెంట్
రాష్ట్రానికి పట్టిన చీడ పురుగులు చంద్రబాబు, లోకేశ్ అని ఏపీ మంత్రి ఆర్కే రోజా మండిడ్డారు. వాళ్ల వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా.. 13 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నా ఏనాడూ ఉపయోగపడే పనులు చేయలేదని విమర్శించారు.
కరోనా, వరదల వంటి సంక్షోభ సమయాల్లోనూ ప్రజలకు అండగా ఉండలేదన్నారు. అప్పుడు సాయం చేయనివాడు.. ఇప్పుడు చేస్తామంటే ఎవరూ నమ్మడం లేదన్నారు. మహిళలని కూడా చూడకుండా మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలపై పార్టీ నేతలతో తిట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును మహిళలు, విద్యార్థులు, రైతులు తరిమికొడతారని అన్నారు.
పవన్ కల్యాణ్ తన కార్యకర్తలతో ఏ ఎన్నికలకు, ఏ జెండాను మోయిస్తాడో తెలియని పరిస్థితి ఉందని, పవన్ కల్యాణ్ అభిమానులు ఈ విషయాన్ని గ్రహించాలని ఆమె సూచించారు. అసలు పవన్ కల్యాణ్ ఏ పార్టీకి పనిచేస్తున్నారో తెలియని గందరగోళంలో అభిమానులున్నారన్నారు. చిరంజీవి ఒకప్పుడు సొంతంగా నిలబడి పోటీ చేశారని, ఆ విలువలు పవన్ కు లేవా? అని ప్రశ్నించారు.
రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల్లో ముంచేసి వెళ్లారని రోజా విమర్శించారు. రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా వాటికి ఎదురొడ్డి జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్న ఒకే ఒక్క సీఎం అని కొనియాడారు.