నేలపై నిద్రించడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయా?

  • ఉన్నాయనే చరిత్ర చెబుతోంది
  • ఎన్నో సంస్కృతుల్లో నేల పాన్పు ఆచరణలో ఉంది
  • నేలపై నిద్రతో సరైన భంగిమలో వెన్నుపూస 
  • నడుము నొప్పి ఉన్నవారికి మెత్తటి పరుపులు వద్దు
మంచి పరుపుపై నిద్రించడం ఆరోగ్యానికి మంచిదేనా..? అంటే అవును అని చెప్పడానికి లేదు. ఎందుకంటే శరీర బరువు, వారి ఆకృతిని బట్టి అందరికీ ఒకే రకమైన పరుపు సరిపోదు. ఎవరికి వారు అనుకూలమైన దాన్ని ఎంపిక చేసుకోవాలి. కానీ, ఇవేమీ లేకుండా కటిక నేలపై పడుకుంటే..? ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మన సంస్కృతి, చరిత్ర చెబుతున్నాయి.

 నేలపై పడుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లోని ప్రజల సంస్కృతిలో భాగంగా ఉంది. నేలపై పడుకోవడం వల్ల శరీర భంగిమ సరైన రీతిలో ఉంటుంది. అదే పరుపులు అయితే మనం నిద్రించే సమయంలో కుంగి ఉంటాయి. ఇది అసౌకర్యాన్ని కలిగిస్తుంది. వెన్నెముక అలైన్ మెంట్ తప్పిపోతుంది. నేలపై పడుకోవడం వల్ల వెన్నెముక నిటారుగా ఉంటుంది. వెన్నెముక సహజ నిర్మాణానికి నేల అనుకూలంగా ఉంటుంది. వెన్నెముకపై ఒత్తిడి తగ్గించుకునేందుకు పిల్లోను వాడుకోవచ్చు. నడుము భాగంలో పలుచని పిల్లోను పెట్టుకుని నిద్రించాలన్నది వైద్యుల సూచన.

ఒకవేళ నడుము నొప్పితో బాధపడుతున్న వారు సాఫ్ట్ పరుపును తెచ్చి వాడుతున్నారనుకోండి. దాంతో నడుము నొప్పి మరింత పెరుగుతుంది. ఫర్మ్ లేదా హార్డ్ మ్యాట్రెస్ పై పడుకోవడం వల్ల నడుము నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. వేసవిలో నేలపై పడుకోవడం వల్ల కాస్త చల్లగా అనిపిస్తుంది. నేల చల్లదనానికి, శరీర ఉష్ణోగ్రత నెమ్మదిగా తగ్గిపోతుంది. దీనివల్ల మరింత గాఢంగా నిద్ర పోవచ్చు.   

అయితే నేలపై నిద్ర అందరికీ కాదు. పెద్దవారు, కీళ్ల నొప్పులు ఉన్నవారు, నేలపై నుంచి పైకి లేవడం కష్టంగా అనిపించే వారు, అలర్జీలు ఉన్నవారు నేల పాన్పుకు దూరంగా ఉండాలి.


More Telugu News