మంత్రదండం అక్కర్లేదు, దృఢ సంకల్పంతో సాగుదాం: సోనియా గాంధీ
- ఉదయ్‌పూర్ వేదికగా చింతన్ శిబిర్
- ఈ నెల 13 నుంచి 15 వ తేదీ వరకు నిర్వహణ
- చింతన్ శిబిర్ ఏర్పాట్లపై సీడబ్ల్యూసీ భేటీ
ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీకి ఏ మంత్రదండం అవసరం లేదని, పార్టీ శ్రేణులు దృఢ సంకల్పంతో ముందుకు సాగితే సత్ఫలితాలు వస్తాయని ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు. పార్టీ పునర్నిర్మాణం దిశగా ఈ నెల 13 నుంచి ఉదయ్‌పూర్ వేదికగా జరగనున్న చింతన్ శిబిర్ సన్నాహకాలపై సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ప్రసంగించిన సోనియా గాంధీ పార్టీ పునరుజ్జీవానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికీ మేలు చేసిందని చెప్పిన సోనియా... ఆ రుణాన్ని తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ దిశగా పార్టీ శ్రేణులు క్రమశిక్షణతో, దృఢ సంకల్పంతో ముందుకు సాగితే ఫలితాలు వాటంతటవే వస్తాయని ఆమె చెప్పారు.
పార్టీ వేదికలపై నేతలకు సంబంధించి స్వీయ విమర్శలు అవసరమని, అయితే ఆ విమర్శలు నేతలను నొప్పించేవిగా ఉండరాదని సూచించారు. చింతన్ శిబిర్‌ను ఏదో సంప్రదాయమైన సమావేశంగా పరిగణించరాదని, పార్టీ పునరుజ్జీవం దిశగా జరిగే కీలక భేటీగా గుర్తించాలని సోనియా సూచించారు.