వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిపై న‌మోదైన కేసు కొట్టివేత‌

  • 2017లో రాజ‌ధాని ప‌రిధిలోని పెనుమాక‌లో గొడ‌వ‌
  • సీఆర్డీఏ అధికారుల‌పై దాడి చేశారంటూ ఆళ్ల‌పై ఫిర్యాదు
  • కేసును విచారించిన విజ‌య‌వాడ‌లోని ఎంపీ, ఎమ్మెల్యేల ప్ర‌త్యేక కోర్టు
వైసీపీ కీల‌క నేత‌, గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిపై న‌మోదైన ఓ కేసును కోర్టు కొట్టివేసింది. ఈ మేర‌కు ఎంపీ, ఎమ్మెల్యేల ప్ర‌త్యేక కోర్టు సోమ‌వారం తీర్పును వెలువరించింది. 2017లో రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిలోని పెనుమాక‌లో సీఆర్డీఏ అధికారుల‌పై దాడి చేశార‌ని ఆళ్ల‌పై కేసు న‌మోదైంది. 

రాజ‌ధాని భూసేక‌ర‌ణ‌కు వ‌చ్చిన అధికారుల‌పై దాడి చేసి వారి విధుల‌కు ఆటంకం క‌లిగించారంటూ ఆళ్ల‌పై నాడు కేసు న‌మోదైంది. నాటి ఘ‌ట‌న‌లో సీఆర్డీఏ అధికారుల ఫిర్యాదుతో ఆళ్ల‌తో పాటు 11 మందిపై కేసులు న‌మోద‌య్యాయి. ఈ కేసును విచారించిన విజ‌య‌వాడలోని ఎంపీ, ఎమ్మెల్యేల ప్ర‌త్యేక కోర్టు సోమ‌వారం నాడు కేసును కొట్టివేసింది.


More Telugu News