డిక్లరేషన్‌పై టీఆర్ఎస్, బీజేపీలకు ఉలికిపాటు ఎందుకు?: టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి
- కాంగ్రెస్ డిక్లరేషన్‌తో రైతుల్లో సంతోషం ఉందన్న మల్లు రవి
- రాహుల్ గాంధీపై విమర్శలు మానుకోకపోతే ప్రజలు ప్రతిఘటిస్తారని హెచ్చరిక
- టీఆర్ఎస్‌ను ప్రజలు గద్దె దింపుతారన్న మల్లు రవి
వరంగల్ రైతు సంఘర్షణ సభలో తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించిన డిక్లరేషన్‌పై టీఆర్ఎస్, బీజేపీలకు ఉలికిపాటు ఎందుకని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రశ్నించారు. సోమవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన... కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్‌పై రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డిక్లరేషన్‌ను అమలు చేస్తుందన్న నమ్మకం రాష్ట్ర ప్రజల్లో నెలకొందని ఆయన చెప్పారు.
రాహుల్ గాంధీపై టీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను ప్రజలు హర్షించడం లేదని మల్లు రవి వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీపై టీఆర్ఎస్‌తో పాటు బీజేపీలు విమర్శలు మానుకోకపోతే ఆ రెండు పార్టీలకు ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ప్రజలు గద్దె దింపుతారని ఆయన అన్నారు. టీఆర్ఎస్, బీజేపీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.