సీఎం జగన్‌తో మాజీ మంత్రి కొడాలి నాని భేటీ
- మంత్రి పదవి కోల్పోయాక తొలిసారి సీఎంతో నాని భేటీ
- తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ
- ఎన్నికల్లో పొత్తులపై పార్టీల ప్రకటనల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి నాని భేటీ అయ్యారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవి కోల్పోయిన తర్వాత నాని తొలిసారిగా సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో సమావేశం అయ్యారు. మంత్రి పదవిని కోల్పోయిన కొడాలి నాని ప్రస్తుతం వైసీపీ కృష్ణా, గుంటూరు జిల్లాల పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
2024 ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా.. ఏపీలో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికల్లో పొత్తుల దిశగా టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి ప్రకటనలు వస్తుండటం, వాటిపై వైసీపీ కూడా ఘాటుగానే స్పందిస్తున్న తరుణంలో జగన్‌తో కొడాలి నాని భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాకుండా ప్రభుత్వంపై ఇటీవలి కాలంలో విపక్షాల దాడులు పెరిగిన నేపథ్యంలోనూ ఈ భేటీపై ఆసక్తి నెలకొంది.