నువ్వు ఎంత వేగంగా బౌలింగ్ చేస్తే వాళ్లంతకంటే వేగంగా కొడతారు: ఉమ్రాన్ మాలిక్ కు రవిశాస్త్రి హెచ్చరిక
- అమితవేగంతో బౌలింగ్ చేస్తున్న ఉమ్రాన్ మాలిక్
- ఐపీఎల్ లో పలు మ్యాచ్ లలో రాణింపు
- గత రెండు మ్యాచ్ లలో ఒక్క వికెట్టూ పడని పరిస్థితి
- సరైన ప్రదేశాల్లో బంతులు వేయడం ముఖ్యమన్న శాస్త్రి
సన్ రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఇటీవల గంటకు 150 కిలోమీటర్ల పైచిలుకు వేగంతో బంతులు విసురుతూ ఔరా అనిపిస్తున్నాడు. అదే సమయంలో బ్యాట్స్ మెన్ అతడి బౌలింగ్ ను అలవోకగా ఎదుర్కొంటున్నారు. కొన్ని మ్యాచ్ లలో విశేషంగా రాణించిన ఉమ్రాన్ మాలిక్... గత రెండు మ్యాచ్ లలో భారీగా పరుగులు సమర్పించుకోవడమే కాదు, ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
ఈ పరిస్థితిపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. పేస్ ను సరిగా వినియోగించుకోకపోతే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని అభిప్రాయపడ్డాడు. వేగాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియకపోతే టీ20ల్లో ఓ మోస్తరు బౌలర్ గానే మిగిలిపోవాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.
"బౌలింగ్ పైనా, వేగంపైనా ఉమ్రాన్ మాలిక్ కు నియంత్రణ అవసరం. 156 కిమీ వేగంతో బౌలింగ్ చేయడం సంతోషమే. కానీ, ఆ వేగంతో విసిరే బంతులు సరైన ప్రదేశాల్లో వేయకపోతే బ్యాట్స్ మెన్ వాటిని అంతకు రెట్టింపు వేగంతో బాదుతారు. ఇప్పుడు జరుగుతోంది కూడా సరిగ్గా అదే. వీరావేశంతో విసిరిన బంతిని బ్యాట్స్ మెన్ 250-300 నాట్స్ వేగంతో బాదుతున్నారు. ఉమ్రాన్ మాలిక్ లో పేస్ బాగుంది. అయితే బ్యాట్స్ మెన్ ను ఆశ్చర్యపరిచే ప్రదేశాల్లో బంతిని పిచ్ చేయడం నేర్చుకోవాలి. ఓ ఫాస్ట్ బౌలర్ మదిలో ఎప్పుడూ ఇలాంటి ఆలోచనలే ఉండాలి" అని రవిశాస్త్రి సలహా ఇచ్చాడు.
అంతేకాదు, ఐపీఎల్ తాజా సీజన్ లో పిచ్ లపై రవిశాస్త్రి స్పందించాడు. టోర్నీ మొదట్లో పేస్ కు సహకరించిన పిచ్ లు, మ్యాచ్ లు జరిగేకొద్దీ నిదానిస్తాయని వెల్లడించాడు. రెండు మూడు వారాల పాటు పిచ్ లు సీమ్ బౌలింగ్ కు అనుకూలంగా కనిపించాయని, ఆ తర్వాత బ్యాటింగ్ కు అనువుగా మారుతున్నాయని వివరించాడు. ఇలాంటి పరిస్థితుల్లో సరైన ప్రదేశాల్లో బంతులు వేయడంపైనే ఉమ్రాన్ మాలిక్ దృష్టి పెట్టాలని హితవు పలికాడు. 156, 157 కిమీ వేగంతో బౌలింగ్ చేయడం అద్భుతమైన విషయం అని, కానీ, దిశ లేని బౌలింగ్ వ్యర్థమని అభిప్రాయపడ్డాడు.