శ్రీలంక రాజధానిలో కర్ఫ్యూ విధింపు

  • తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక
  • రాష్ట్రపతి, ప్రధాని రాజీనామా చేయాలంటూ ప్రజల డిమాండ్
  • పరిస్థితిని అదుపు చేసేందుకు కొలంబోలో కర్ఫ్యూ విధింపు
శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం ఆ దేశాన్ని అట్టుడికేలా చేస్తోంది. సంక్షోభం కారణంగా ఆ దేశ ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఆందోళనలు హింసాత్మకరూపు దాల్చాయి. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే, ప్రధాని మహింద రాజపక్సేలు రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంక రాజధాని కొలంబోలో కర్ఫ్యూ విధించారు. మరోవైపు పరిస్థితులను అదుపు చేసే క్రమంలో పోలీసులు ఆందోళనకారులపై టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు, లాఠీలతో దాడి చేశారు. ఈ దాడుల్లో 20 మంది వరకు గాయపడ్డారు.


More Telugu News