భాగ్యనగరిలో మరో ఐటీ సంస్థ.. కేటీఆర్‌తో గ్రిడ్ డైనమిక్స్ సీఈఓ భేటీ
- డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ రంగంలో దిగ్గజ కంపెనీగా గ్రిడ్ డైనమిక్స్
- అమెరికా, యూరప్‌లలో సంస్థ కార్యకలాపాలు
- భారత్‌లో తన తొలి కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటుకు సంసిద్ధత
భారత ఐటీ రంగంలో దూసుకెళుతున్న హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ ఐటీ సంస్థ కాలుమోపింది. అమెరికా సహా యూరోప్ వ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తున్న డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ దిగ్గజం గ్రిడ్ డైనమిక్స్ తాజాగా హైదరాబాద్‌లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
ఈ మేరకు సోమవారం గ్రిడ్ డైనమిక్స్ సీఈఓ లియోనార్డ్ లివ్‌సిజ్ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. భారత్‌లోనే తన తొలి కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా లియోనార్డ్ తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి 1,000 మంది ఉద్యోగులతో కూడిన కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.