కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా నిన్న 29 మంది మృతి.. అప్టేడ్స్ ఇవిగో!
- గత 24 గంటల్లో 3,207 కేసుల నమోదు
- దేశ వ్యాప్తంగా 29 మంది మృతి
- దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 20,403
దేశంలో కరోనా వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. నిన్న కూడా 3 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 3,207 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా 29 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 20,403 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,31,05,401కి చేరుకుంది. మృతుల సంఖ్య 5,24,093కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. దేశంలో అత్యధిక కేసులు ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు 91.5 కోట్ల కరోనా వైరస్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.