6 నెలలు సామాజిక మాధ్యమాలను వాడకండి: మంత్రి కేటీఆర్
- ఉద్యోగాలకు పోటీ పడుతోన్న అభ్యర్థులకు కేటీఆర్ పుస్తకాల అందజేత
- 6 నెలలు ఉద్యోగాల కోసం పోటీపడి సాధించాలని పిలుపు
- సుమారు 90 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వ్యాఖ్య
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల అవుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ పట్టణంలోని ఎక్స్పో ప్లాజాలో శాంతా నారాయణ గౌడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఉద్యోగాలకు పోటీ పడుతోన్న అభ్యర్థులకు కేటీఆర్ పలు పుస్తకాలను అందజేసి, అనంతరం మాట్లాడారు.
నిరుద్యోగ యువత రాబోయే ఆరు నెలల పాటు సామాజిక మాధ్యమాలను వాడకూడదని, వాటికి దూరంగా ఉంటూ ఉద్యోగాల కోసం పోటీపడి సాధించాలని చెప్పారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ సుమారు 90 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రకటన చేశారని అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన విజ్ఞప్తి మేరకు మహబూబ్ నగర్ పట్టణానికి అవసరమైన నిధులను మునిసిపల్ శాఖ ద్వారా మంజూరు చేస్తామని తెలిపారు. పట్టణ అభివృద్ధికి అవసరమైన మేర తమ సహకారం ఉంటుందని చెప్పారు.