ప్రజల కోసమే పొత్తులు పెట్టుకుంటున్నామంటూ పవన్ చెప్పడం హాస్యాస్పదం: కాంగ్రెస్ నేత తులసిరెడ్డి
- దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలను కేంద్రం పెంచిందన్న తులసిరెడ్డి
- బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు నరకం చూపిస్తోందని వ్యాఖ్య
- పొత్తుల విషయంలో పవన్ వ్యాఖ్యల్లో చిత్తశుద్ధి లేదని విమర్శ
ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తోన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత తులసి రెడ్డి మండిపడ్డారు. ఈ రోజు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ... దేశంలో వంట గ్యాస్ తో పాటు డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతూ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు నరకం చూపిస్తోందని, అలాంటి పార్టీతో 100 శాతం పొత్తు ఉంటుందంటూ పవన్ అంటున్నారని ఆయన విమర్శించారు.
ప్రజల కోసమే ఈ పొత్తులు పెట్టుకుంటున్నామంటూ పవన్ చెప్పడం హాస్యాస్పదమని తులసి రెడ్డి చెప్పారు. పొత్తుల విషయంలో పవన్ వ్యాఖ్యల్లో చిత్తశుద్ధి లేదని ఆయన తెలిపారు. ఏపీకి నంబర్ వన్ ద్రోహి బీజేపీ అని, నంబర్ టూ ద్రోహి వైసీపీ అని ఆయన విమర్శలు గుప్పించారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక సాయం ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని ఆయన అన్నారు.