వాట్సాప్ వాయిస్ కాల్స్ రికార్డింగ్ ఎలా..?

  • యాప్ లో డిఫాల్ట్ గా అయితే ఫీచర్ ఉండదు
  • వేరొక ఫోన్ తో రికార్డు చేసుకోవచ్చు
  • లేదంటే గూగుల్ ప్లే స్టోర్లో పదుల సంఖ్యలో యాప్స్
  • ఇన్ స్టాల్ కు ముందు యాప్ గురించి తెలుసుకోవాలి
గతంతో పోలిస్తే వాట్సాప్ కాల్స్ మాట్లాడుకోవడం ఎక్కువ అవుతోంది. వాయిస్ తోపాటు వీడియో కాల్స్ కూడా మాట్లాడుకోగల సౌలభ్యం వల్ల ఎక్కువ మంది వాట్సాప్ ను కాల్స్ కోసం వాడుతుంటారు. చాట్ చేసుకోవడం, లైవ్ లొకేషన్ ను షేర్ చేసుకోవడం, ఫొటోలు, వీడియోలు, ఫైల్స్ షేర్ చేసుకోవడం, ప్రపంచంలో ఎక్కడ ఉన్నవారితో అయినా కాల్స్ మాట్లాడుకోగల సౌలభ్యాలు ఇందులో ఉన్నాయి.

స్మార్ట్ ఫోన్ల నుంచి కాల్ చేసుకునేట్టు అయితే రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది. మరి వాట్సాప్ యాప్ లో ఈ సదుపాయం లేదు. ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాల్సి ఉంటుంది. ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడే సమయంలో రికార్డు చేస్తే, అది ఆ తర్వాత ఎంతో ఉపయోగపడొచ్చు. 

మీ దగ్గర రెండో ఫోన్ ఉంటే వాట్సాప్ కాల్ స్పీకర్ ఆన్ చేసి రికార్డు చేసుకోవచ్చు. మాట్లాడుకునే విషయాలు ఎవరూ వినకూడదు, రికార్డింగ్ చేసుకోవాలి అనుకుంటే ఎవరూ లేని చోటకు వెళ్లి చేసుకోవడమే మార్గం. 

థర్డ్ పార్టీ యాప్ లు అంత సురక్షితం కావు. కనుక గూగుల్ ప్లే స్టోర్ కు వెళితే కనుక అక్కడ విశ్వసనీయ యాప్ లు లభిస్తాయి. యాప్స్ కింద యూజర్ల రివ్యూలు కనిపిస్తాయి. వాటిని ఓపికగా చదివితే అది మీకు అనుకూలమా? కాదా? తెలుస్తుంది. ‘కాల్ రికార్డర్ క్యూబ్ ఏసీఆర్ యాప్’అని ఒకటి ఉంది. దీన్ని ఇన్ స్టాల్ చేసుకుంటే ఆటోమేటిగ్గా వాట్సాప్ కాల్స్ ను రికార్డు చేస్తుంది. అంతేకాదు, టెలిగ్రామ్, స్లాక్, ఫేస్ బుక్, సిగ్నల్ యాప్ ల నుంచి చేసుకునే కాల్స్ కూడా ఈ యాప్ లో రికార్డు అవుతాయి. యాప్ ను ఫోన్లో ఇన్ స్టాల్ చేసుకున్న తర్వాత ఏ యాప్ కు సంబంధించి కాల్స్ రికార్డ్ చేసుకోవాలన్నది తెలియజేయాలి.


More Telugu News