అమ్మకు ప్రేమతో ఈ ఐదు స్మార్ట్ కానుకలు

  • నేడు మాతృ దినోత్సవం
  • అమ్మకు ఇచ్చే గిఫ్ట్ ఉపయోగపడేలా ఉండాలి
  • స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, బ్లూటూత్ హెడ్ సెట్
  • స్మార్ట్ స్పీకర్ లేదా స్మార్ట్ ల్యాంప్
  • వీటితో అమ్మకు ఎంతో సౌకర్యం  
‘అమ్మను మించి దైవం లేదు’.. ప్రతి ఒక్కరూ దీన్ని అంగీకరిస్తారు. ఈ భూమిపై మనకంటూ చోటు కల్పించిన ప్రత్యక్ష మూర్తి అమ్మే ప్రథమ దైవం అవుతుంది. అందుకే ఏటా మే నెల రెండో ఆదివారాన్ని మాతృ దినోత్సవంగా జరుపుకుంటుంటారు. మన దేశంలోనూ అంతే. కాకపోతే అరబ్ దేశాల్లో వేరే రోజు దీన్ని నిర్వహిస్తుంటారు. నేడు మాతృ దినోత్సవం సందర్భంగా అమ్మకు ప్రేమతో ఇవ్వతగిన కొన్ని కానుకలు ఇవి. వీటితో అమ్మకు సౌకర్యం, సంతోషం కలిగించొచ్చు.

స్మార్ట్ ఫోన్
అమ్మకు ఫోన్ అవసరమైతే అందుకు మాతృ దినోత్సవమే సరైన సందర్భం. నేటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ అవసరం ఎంతో పెరిగిపోయింది. వీడియో కాల్ మాట్లాడాలన్నా, ఫొటోలు, ఇతర సమాచారాన్ని వాట్సాప్ తదితర యాప్స్ ద్వారా షేర్ చేసుకోవాలన్నా, నగదు బదిలీ చేసుకోవాలన్నా స్మార్ట్ ఫోన్ కావాల్సిందే. కనుక అమ్మకు ఒక మంచి స్మార్ట్ ఫోన్ ఇవ్వడం ఎంతైనా అవసరమే. 

వైర్ లెస్ ఇయర్ ఫోన్
స్మార్ట్ ఫోన్లలో పాటలు వినే వారు చాలా మందే ఉన్నారు. ఫోన్లలోనే సీరియళ్లు, సినిమాలు చూసే మహిళలు కూడా ఉన్నారు. అందుకే వారికి ఇయర్ ఫోన్ ఎంతో అవసరం. వైర్డ్ ఇయర్ ఫోన్ తో ఇబ్బంది ఉంటుంది. అటూ, ఇటూ స్వేచ్ఛగా కదిలే సౌకర్యం ఉండదు. అదే బ్లూటూత్ హెడ్ సెట్ కొని అమ్మకు ఇస్తే ఎంత సౌకర్యం ఉంటుందో? ఒక్కసారి ఆలోచించండి. 

స్మార్ట్ స్పీకర్
హెడ్ సెట్లు అందరికీ సౌకర్యంగా ఉంటాయని చెప్పలేం. చెవులకు ఎక్కువ సమయం పాటు హెడ్ సెట్ తగిలించి ఉంచుకోవడం కొందరికి అసౌకర్యంగా ఉంటుంది. అటువంటప్పుడు బ్లూటూత్ స్మార్ట్ స్పీకర్ కొనివ్వడం మంచి ఆలోచన అవుతుంది. గూగుల్, అమెజాన్ నాణ్యమైన స్పీకర్లను ఆఫర్ చేస్తున్నాయి.

స్మార్ట్ వాచ్
చేతికి ధరించే స్మార్ట్ వాచ్ లకు ఆదరణ పెరుగుతోంది. పేరుకు తగ్గట్టు ఇవి ఎన్నో పనులను స్మార్ట్ గా చేస్తుంటాయి. కేవలం సమయం చూపించడమే కాదు.. రోజూ ఎన్ని అడుగులు నడుస్తున్నారు, ఎన్ని కేలరీలు ఖర్చు చేస్తున్నారు? గుండె రేటు ఎంత, ఆక్సిజన్ శాచురేషన్ ఎంతన్నది చెప్పేస్తుంది. నిద్ర  తీరు ఎలా ఉందో కూడా వీటి సాయంతో తెలుసుకోవచ్చు. వీటికి అదనంగా స్మార్ట్ వాచ్ నుంచే కాల్ స్వీకరించడం, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడడం, ఎస్ఎంఎస్ చూసుకోవడం, ఇలా ఎన్నో ఫీచర్లతో ఇవి వస్తున్నాయి.

స్మార్ట్ ల్యాంప్
అమ్మకు పుస్తకాలు చదివే అలవాటు ఉంటే స్మార్ట్ ల్యాంప్ కొని ఇవ్వడం కూడా మంచి ఆలోచనే అవుతుంది. షావోమీ ఎంఐ స్మార్ట్ బిసైడ్ ల్యాంప్ 2 ధర రూ.2,799. అమెజాన్ ప్లాట్ ఫామ్ పై అందుబాటులో ఉంది. ల్యాంప్ కలర్, బ్రైట్ నెస్ ను అడ్జెస్ట్ చేసుకోవచ్చు. టచ్ తో ల్యాంప్ ఆన్, ఆఫ్ అవుతుంది. మొబైల్ యాప్, అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ తోనూ ల్యాంప్ ను కంట్రోల్ చేయవచ్చు.


More Telugu News