దీన్నే 'వంచన' అంటారు: మంత్రి కేటీఆర్
- ట్విట్టర్‌లో ప్రజలు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం
- వంట గ్యాస్ ధర రూ.50 పెరిగిందని యూపీఏ హయాంలో స్మృతి ఇరానీ ధర్నా
- ఆ ఫొటోపై స్పందించిన కేటీఆర్
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు ట్విట్టర్‌లో ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు కేంద్ర ప్రభుత్వ తీరు గురించి కేటీఆర్‌ను ప్రశ్నించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో వంట గ్యాస్ ధర రూ.50 పెరిగిన నేపథ్యంలో అప్పట్లో స్మృతి ఇరానీ బీజేపీ నేతలతో కలిసి ధర్నాకు దిగిన ఫొటోను ఓ నెటిజన్ పోస్ట్ చేసి దీనిపై స్పందించాలని కోరాడు. దీంతో కేటీఆర్ స్పందిస్తూ 'వంచన' అని సమాధానం ఇచ్చారు.
అలాగే, కర్ణాటకలో సీఎం కావాలంటే రూ.2,500 కోట్లు అడుగుతున్నారంటూ వచ్చిన ఓ వార్తను పోస్ట్ చేస్తూ ఓ నెటిజన్ దానిపై స్పందించాలని కేటీఆర్‌ను అడిగాడు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ... 'బీజేపీ నిజ రూపం ఇదే' అంటూ సమాధానం ఇచ్చారు.
కాగా, బీఆర్ఎస్ కోసం తాము 2017లో డబ్బులు కట్టామని, ఇప్పటి వరకు ఆమోదం పొందలేదని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. దానిపై కేటీఆర్ స్పందిస్తూ.. బీఆర్ఎస్ అంశం హైకోర్టు పరిధిలో ఉందని తెలిపారు. అలాగే, నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు.