ఎట్టకేలకు పెళ్లి అంటూ కమెడియన్ రాహుల్ రామకృష్ణ పోస్ట్.. అతడు పెట్టిన ఫొటోపై ట్విట్టర్ లో మాటల యుద్ధం
- కాబోయే అర్ధాంగికి ముద్దుపెడుతున్న ఫొటో పోస్ట్
- భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
- తిట్టిపోస్తున్న కొందరు యూజర్లు
- రాహుల్ కు మద్దతుగా మరికొందరు
ప్రముఖ కమెడియన్ రాహుల్ రామకృష్ణ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లాడబోతున్నాడు. ఫొటో పోస్ట్ చేసి మరీ ఈ విషయాన్ని వెల్లడించాడు. అయితే, ఆ పెట్టిన ఫొటోనే ఇప్పుడు నెట్టింట్లో భిన్నాభిప్రాయాలకు కారణమైంది. కొందరు రాహుల్ ను తిట్టిపోస్తుంటే.. మరికొందరు అతడికి అండగా నిలబడుతున్నారు.
తనకు కాబోయే భార్యకు ముద్దుపెట్టే ఫొటోను పోస్ట్ చేస్తూ.. ఎట్టకేలకు తాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు రాహుల్ ప్రకటించాడు. అయితే, ఆ ఫొటోను చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. ‘‘ఇప్పుడు ముద్దులు పెట్టే ఫొటో పోస్ట్ చేశారు.. రేపు బెడ్ సీన్స్ పెడతారా?’’ ఏంటి అంటూ ఓ నెటిజన్ ఫైర్ అయ్యాడు. కొంచెం ఇమేజ్ వస్తే చాలు ఇలా దిగజారిపోవడమేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
‘‘కంగ్రాట్స్ అన్నా. కానీ, ఇలా లిప్ లాక్ ఫొటో కాకుండా వేరే ఫొటో పెట్టి ఉంటే బాగుండేది. మీరు చేసిందేం బాగాలేదు. మీ కుటుంబానికి గౌరవం ఇవ్వలేదు’’ అంటూ మరో యూజర్ వ్యాఖ్యానించాడు. జనాలను సగం చెడగొడుతున్నది సినిమా వాళ్లేనంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. నాలుగు గోడల మధ్య జరిగేది.. ఇలా పబ్లిక్ గా పోస్ట్ పెట్టి సమాజానికి చెప్పాలా? అంటూ మరో వ్యక్తి మెసేజ్ పెట్టాడు.
ఫేమస్ అయ్యేందుకు భార్యను కూడా చీప్ చేస్తావా? అంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. అయితే, మరికొందరు మాత్రం రాహుల్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు. అందులో తప్పేముందంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ రోజుల్లో ఇలాంటివి కామన్ అంటూ మద్దతుగా నిలుస్తున్నారు. నీతులు చెప్పడం ఆపాలంటూ ట్రోల్స్ చేస్తున్న వారికి సూటిగా చెబుతున్నారు. మొత్తానికి రాహుల్ పెళ్లి సంగతి పక్కనపెడితే.. పెట్టిన ఆ ఫొటో మీద నెటిజన్ల మధ్య చిన్నపాటి మాటల యుద్ధమే నడుస్తోంది. మీరేమంటారు!