హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ వద్ద ఖలిస్థాన్ జెండాల కలకలం.. వీడియో ఇదిగో
- గత అర్ధరాత్రి దాటాక దుండగులు ఏర్పాటు చేసిన వైనం
- అసెంబ్లీ ప్రధాన గేటుకి, గోడలపై ఉంచిన దుండగులు
- కేసు నమోదు చేసుకున్న పోలీసులు
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ వద్ద ఖలిస్థాన్ జెండాలు కనపడడం కలకలం రేపింది. గత అర్ధరాత్రి దాటాక దుండగులు వీటిని అక్కడ పెట్టినట్లు తెలుస్తోంది. ధర్మశాలలోని అసెంబ్లీ ప్రధాన గేటుకి అలాగే, గోడలపై దుండగులు ఆ జెండాలను ఉంచారు. ఇందుకు సంబంధించిన వీడియో మీడియాకు చిక్కింది.
ఈ రోజు ఉదయం వాటిని గుర్తించిన అనంతరం పోలీసులు వాటిని తొలగించారు. విధాన సభ గేటుకు ఉన్న ఖలిస్థాన్ జెండాలను తొలగించామని పోలీసులు మీడియాకు తెలిపారు. పంజాబ్ నుంచి వచ్చిన వేర్పాటు వాదులు ఈ దుస్సాహసానికి వడిగట్టి ఉంటారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.