మా జట్టు బ్యాట్స్‌మెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి స్కోర్ పెంచారు: కేఎల్ రాహుల్
- గత రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో విజయం
- తన రనౌట్ ఒక్కటే నిరాశపర్చిందన్న రాహుల్
- ఈ పిచ్‌లో పరుగులు సులభంగా చేయవచ్చనే అభిప్రాయం కలిగిందని వ్యాఖ్య
ఐపీఎల్ లో గత రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీనిపై లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పందిస్తూ... ఈ మ్యాచ్‌లో తమ జట్టు సభ్యులు చాలా అద్భుతంగా ఆడారని అన్నాడు. తన రనౌట్ ఒక్కటే నిరాశపర్చిందని తెలిపాడు. క్వింటన్ డికాక్, దీపక్ హూడా బ్యాటింగ్ చేసిన తీరు చూస్తే ఈ పిచ్‌లో పరుగులు సులభంగా చేయవచ్చనే అభిప్రాయం కలిగిందని అన్నాడు.
మ్యాచ్ చివరలో స్లాయినిస్, జేసన్ హోల్డర్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసి స్కోర్ పెంచారని వివరించాడు. బౌలింగ్‌లోనూ తమ జట్టు రాణించిందని, ఇంతకుమించి వారినుంచి ఎక్కువ ఆశించలేనని తెలిపాడు. నైపుణ్యాలు ఉండటం ఒక్క ఎత్తని, వాటిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో తెలిసి ఉండటం మరో ఎత్తు అని చెప్పాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో రస్సెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో భయమేసిందని, అయితే, తమ బౌలర్లు ప్రణాళికలకు కట్టుబడి బౌలింగ్ చేశారని చెప్పాడు. తమ జట్టు మెరుగవ్వాల్సిన విషయాలు చాలా ఉన్నాయని తెలిపాడు. తమ జట్టు కీలక సమయంలో రాణిస్తుందో లేదో కానీ, విజయాలు మాత్రం సాధిస్తోందని తెలిపాడు.