అజ్మేర్‌లోని అనాసాగర్ సరస్సులో కొట్టుకొచ్చిన నోట్ల కట్టలు.. వీడియో ఇదిగో!
- నోట్ల కట్టలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు
- తడిచిపోయి ఉండడంతో లెక్కింపు సాధ్యం కాలేదన్న పోలీసులు
- గతేడాది కూడా ఇదే సరస్సులో కొట్టుకొచ్చిన కరెన్సీ నోట్లు
రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో ఉన్న అనాసాగర్ సరస్సులో 2 వేల రూపాయల నోట్లు కొట్టుకు రావడం కలకలం రేపింది. సరస్సు ఒడ్డున నడుస్తున్న కొందరు నీటిలో కొట్టుకొస్తున్న నోట్ల కట్టలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నోట్లు పూర్తిగా తడిచిపోయి ఉండడంతో వాటిని లెక్కించడం సాధ్యం కాలేదని అనాసాగర్ ఎస్పీ బలదేవ్ సింగ్ తెలిపారు. నోట్లు ఆరిన తర్వాత లెక్కిస్తామని చెప్పారు. సరస్సులోకి నోట్లను ఎవరు విసిరేసి ఉంటారన్న దానిపై దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు.
ఇవి నకిలీ నోట్లన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే, పోలీసులు మాత్రం ఆ నోట్లపై భారతీయ రిజర్వుబ్యాంకు స్టాంపు ఉందని చెబుతున్నారు. ఓ పాలిథిన్ కవర్‌లో కట్టి వీటిని సరస్సులోకి విసిరేశారని పేర్కొన్నారు. ఇదే సరస్సులో గతేడాది జూన్‌లోనూ ఇలానే నోట్లు తేలియాడుతూ కనిపించాయి. రామప్రసాద్ ఘాట్ వద్ద కనిపించిన రూ. 200, రూ. 500 నోట్లను చేజిక్కించుకునేందుకు కొందరు ప్రాణాలకు తెగించి సరస్సులో దూకారు.