విశాఖ వైసీపీలో రగడ... వైవీ సుబ్బారెడ్డి ఎదుటే ఇరువర్గాల తోపులాట
- టీడీపీ తరఫున గెలిచి వైసీపీకి దగ్గరైన వాసుపల్లి గణేశ్
- విశాఖ దక్షిణలో ఆది నుంచి వైసీపీ నేతగా సుధాకర్
- నియోజకవర్గ సమీక్షలో భాగంగా ఇరు వర్గాల మధ్య నినాదాల హోరు
ఏపీలో అధికార పార్టీ వైసీపీ విశాఖ నగర శాఖలో రెండు వర్గాలుగా విడిపోయిన ఇద్దరు నేతలు పరస్పరం వాదులాడుకున్నారు. ఈ తతంగం మొత్తం పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమక్షంలోనే జరగడం గమనార్హం.
ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకెళితే... 2019 ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై విశాఖ దక్షిణ ఎమ్మెల్యేగా గెలిచిన వాసుపల్లి గణేశ్ కుమార్ మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీకి అనుకూలంగా మారిపోయారు. తన కుమారుడిని వైసీపీలో చేర్పించిన వాసుపల్లి.. తాను టీడీపీకి దూరం జరిగారు. ఈ క్రమంలో ఆ నియోజకవర్గంలో ఆది నుంచి వైసీపీలో కొనసాగుతున్న బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్, గణేశ్ మధ్య వర్గ విభేదాలు తలెత్తాయి.
ఈ క్రమంలో శనివారం పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ హోదాలో విశాఖ వెళ్లిన వైవీ సుబ్బారెడ్డి విశాఖ దక్షిణ నియోజకవర్గ పార్టీ సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుపల్లి, సుధాకర్ వర్గాలకు చెందిన శ్రేణులు పరస్పరం నినాదాలు చేసుకున్నాయి. అంతేకాకుండా ఇరు వర్గాలకు చెందిన నేతలు పరస్పరం తోసుకున్నారు. తన ఎదురుగా జరుగుతున్న ఈ తతంగంపై వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇరు వర్గాలు వెనక్కు తగ్గాయి.