దత్తత గ్రామం వెళుతుంటే టీఆర్ఎస్ అడ్డగింత... కమిషనర్ కార్యాలయం ముందు ఎంపీ అరవింద్ బైఠాయింపు
- కుకునూర్‌ను దత్తత తీసుకున్న అరవింద్
- పనుల పర్యవేక్షణ కోసం గ్రామానికి పయనం
- వేల్పూర్ క్రాస్ వద్ద అడ్డుకున్న టీఆర్ఎస్ శ్రేణులు
- పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ ఎంపీ
బీజేపీ యువ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ టీఆర్ఎస్ శ్రేణుల అడ్డగింతతో నడిరోడ్డుపైనే బైఠాయించారు. దీంతో నిజామాబాద్ పరిధిలోని వేల్పూర్ క్రాస్ రోడ్డు వద్ద శనివారం సాయంత్రం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీసుల తీరుపైనా, ఫిర్యాదు చేసినా పట్టించుకోని నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌పైనా అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటన వివరాల్లోకెళితే... నిజామాబాద్ పరిధిలోని కుకునూర్ గ్రామాన్ని అరవింద్ దత్తత తీసుకున్నారు. తనకు వచ్చే ఎంపీల్యాడ్స్‌తో ఆ గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు అరవింద్ తన అనుచరులతో కలిసి కుకునూర్ బయలుదేరారు.
వేల్పూర్ క్రాస్ రోడ్ వద్దకు రాగానే...ఆయనను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఈ విషయం తెలియజేసిన అరవింద్ టీఆర్ఎస్ శ్రేణులను అక్కడి నుంచి తరలించాలని కోరారు. అయితే పోలీసుల నుంచి ఎంతసేపటికీ స్పందన రాకపోవడంతో కమిషనర్ వైఖరిని నిరసిస్తూ నేరుగా కమిషనర్ కార్యాలయం వద్దకు వెళ్లిన అరవింద్ తన అనుచరులతో కలిసి బైఠాయించారు.