గుంటూరులో వైసీపీ జాబ్ మేళా... తొలి రోజు 7,473 మందికి ఉద్యోగాలు.. వెల్లడించిన విజయసాయిరెడ్డి
- ఏఎన్‌యూలో జాబ్ మేళా
- తొలి రోజే 373 మందికి నియామక పత్రాలు
- రేపు కూడా కొనసాగనున్న జాబ్ మేళా
ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాల్లో భాగంగా కోస్తాంధ్ర నిరుద్యోగుల కోసం గుంటూరు జిల్లా పరిధిలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో శనివారం జాబ్ మేళా ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ జాబ్ మేళాలో తొలి రోజే 7,473 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఆయా కంపెనీలు అందించిన ఈ ఉద్యోగాల్లో ఇప్పటికే 373 మందికి అక్కడికక్కడే నియామక పత్రాలు కూడా అందజేశారు.
ఈ మేరకు జాబ్ మేళాలను పర్యవేక్షిస్తున్న వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి శనివారం రాత్రి ట్విట్టర్ వేదికగా వివరాలు వెల్లడించారు. జాబ్ మేళాలో ఉద్యోగాలు దక్కించుకున్న వారికి విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు.