సాగు మోటార్ల‌కు మీట‌ర్లన్న‌ జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌పై రైతు సంఘం స్పంద‌న ఇదే

  • సాగు మోటార్ల‌కు మీట‌ర్లు అంటే రైతుకు ఉరితాడేనంటున్న రైతుసంఘం 
  • మెట్ట పంట‌ల‌కు సాగు మోటార్లే ప్ర‌ధానమని వెల్లడి 
  • మీటర్ల‌తో నాణ్య‌మైన విద్యుత్ ఎలా వ‌స్తుందో చెప్పాలంటూ డిమాండ్ 
  • 7 గంటలు విద్యుత్ ఇచ్చి నిరంత‌ర స‌ర‌ఫ‌రా అని చెబుతార‌న్న రైతు సంఘం
వ్య‌వ‌సాయ మోటార్ల‌కు మీట‌ర్ల‌ను ఏర్పాటు చేస్తామంటూ ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేసిన ప్ర‌క‌ట‌న‌పై ఏపీ రైతు సంఘం స్పందించింది. ఓ టీవీ నిర్వ‌హించిన డీబేట్‌లో పాల్గొన్న సంద‌ర్భంగా రైతు సంఘం ప్ర‌తినిధులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సాగు మోటార్ల‌కు మీట‌ర్ల ఏర్పాటుతో నాణ్య‌మైన విద్యుత్ ఎలా వ‌స్తుందో చెప్పాలంటూ వారు ప్ర‌శ్నించారు. 

కేవ‌లం 7 గంట‌ల పాటు సాగుకు విద్యుత్ ఇస్తూ నిరంత‌ర స‌ర‌ఫ‌రా అంటూ ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం హాస్యాస్ప‌ద‌మ‌ని రైతు సంఘం ప్రతినిధులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మెట్ట పంట‌ల‌కు వ్య‌వ‌సాయ మోటార్లే ప్రధాన‌మ‌న్న రైతు సంఘం... మోటార్ల‌కు స్మార్ట్ మీట‌ర్ల ఏర్పాటుకు వ్య‌తిరేక‌మ‌ని ప్ర‌క‌టించింది. రైతుల‌కు ఉరితాడుగా ప‌రిణ‌మించ‌నున్న మీట‌ర్ల ఏర్పాటు నిర్ణ‌యాన్ని వెన‌క్కు తీసుకోవాల‌ని సంఘం ప్ర‌తినిధులు డిమాండ్ చేశారు.


More Telugu News